శ్రీ శ్రీ శ్రీ మహా శక్తి పీఠం
Sri Sri Sri Maha Shakti Peetham
గాలికి దీపం పెట్టి నీదే భారం అంటే దీపం నిలుస్తుందా? సునాయాసంగా సాగవలసిన జీవితం దుర్భరంగా మారిందా? మీ కష్టాలకు ఆటంకాలకు గల కారణాన్ని అమ్మగారి దివ్య శక్తి ద్వారా తెలుసుకోండి. విశ్వాసంతో ముందడుగు వేయండి.
If you leave a lamp in a storm and shift the burden, will it stay lit? Has a life that should flow smoothly become unbearable? Discover the root causes of your blockages through Amma's divine spiritual insight. Move forward with absolute faith.
క్రిందికి చూడండి
Scroll Down
దివ్య యాత్ర
Divine Journey
రామలక్ష్మి అనే పేరుతో ఒక సామాన్య గృహిణిగా కుటుంబ జీవనం సాగిస్తున్న ఒక మహిళ జీవితంలో ఒక వింతైన మార్పు వచ్చింది. ఆమెకు కొన్ని అదృశ్య శబ్దాలు తరచుగా వినిపించడం గమనించి మొదట భయపడ్డారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోగా, వారు గాలి సోకిందని భావించి ఒక సిద్ధాంతి/మంత్రవాది వద్దకు తీసుకువెళ్లారు.
Living as a simple housewife under the name of Ramalakshmi, her family life took a profound spiritual turn. She began hearing strange divine sounds and frequencies, which initially brought fear. Sharing this with her family, they suspected external negative energies and took her to a spiritual healer.
"ఇది దుష్ట గాలి కాదు... ఒక మహా దివ్య శక్తి నిన్ను ఆవహించి ఉంది. ఆ మహాశక్తి మరియు కొన్ని అదృశ్య శక్తులు నీ ద్వారా లోకానికి ఏదో మంచి చెప్పాలని చూస్తున్నాయి!"
"This is no negative wind... a supreme divine energy is manifesting within you. The Great Mother and other invisible guardians wish to communicate wisdom to the world through you!"
ఆ మాటల వెనుక ఉన్న నిజాన్ని మరియు ఆ మహా శక్తిని తెలుసుకుని, "ఇక అమ్మ సేవలోనే నా జీవితం" అని 2019 లో దృఢంగా నిర్ణయించుకున్నారు. అమ్మవారి విగ్రహాన్ని ఇంట్లోనే ప్రతిష్టించి పూజించుకుంటుండగా, కష్టాల్లో ఉన్న ప్రజలకు వారి బాధలకు పరిష్కారాలు లభించాయి. ఆ నమ్మకమే నేడు వేలాది మందిని ఈ పీఠం వైపు నడిపిస్తోంది.
Realizing her higher calling, she dedicated her life to the Divine Mother in 2019. Installing the deity in her home sanctum, she began offering spiritual remedies. People obtained miraculous relief, building a strong community of faith that attracts seekers from all around today.
ఒకరోజు అమ్మగారి స్వప్నంలో తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై, "నేను ఒక ధనిక మామిడి చెట్టు క్రింద నివసిస్తున్నాను, నన్ను బయటకు తీసి లోకానికి బహిర్గతం చెయ్యి" అని కోరారు.
One night, Lord Venkateswara of Tirumala appeared in Amma's dream, saying: "I reside underneath the roots of a wild mango tree here. Unearth My form and reveal it to the world."
ఆమె తనకు వచ్చిన కల గురించి అమ్మవారి వద్ద ధ్యానించగా, అమ్మవారు అది సత్యమని నిర్ధారించి స్వామివారిని ప్రతిష్టించమని ఆదేశించారు. గ్రామస్తుల సమక్షంలో సదరు మామిడి చెట్టు తొలగించి త్రవ్వి చూడగా... అక్కడ శతాబ్దాల నాటి ప్రాచీన శిధిలమైన శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడింది! గ్రామస్తులంతా ఆశ్చర్యంతో స్వామి వారిని సాక్షాత్కరించుకున్నారు. అక్కడ ఒక సుందర ఆలయం నిర్మించి ఆ గ్రామానికి అంకితం చేసిన విషయం నేడు సర్వజన విదితం.
Seeking confirmation, Amma meditated before the Divine Mother, who validated the dream and commanded her to proceed. In the presence of local villagers, the roots of the designated mango tree were carefully cleared. To everyone's absolute astonishment, a weathered, ancient stone idol of Lord Venkateswara emerged! A temple was constructed on that sacred ground, transforming the village forever.
దివ్య సహాయం
Divine Interventions
మంత్ర తంత్రాలు మరియు యాగాల యజ్ఞాల వెనుక దాగి ఉండే ఫలితాలను అమ్మగారు తన దివ్య దృష్ఠి ద్వారా ముందే గ్రహించి మీకు మార్గదర్శనం చేస్తారు.
Amma perceives the spiritual currents of your home and lineage, offering clear remedies rather than blind rituals.
మీ ముఖ వర్చస్సు మరియు రేఖలను బట్టి మీ జాతక గతిని, ఎదుర్కొంటున్న ఆటంకాలను సునాయాసంగా వివరించే శక్తి.
Instantly perceiving your life pathway, current struggles, and past blocks by observing your facial aura.
మీ గృహంలో కొలువైన మీ ఇష్ట దైవంతో ప్రత్యక్షంగా సంభాషించి వారి ఆగ్రహ అనుగ్రహాలను మీకు వివరించగలరు.
Connecting directly with your household deity to understand their guidance, blocks, and spiritual messages.
గృహ నిర్మాణాలు, గృహ దోషాలను మీ కులదైవం ద్వారా తెలుసుకొని, పెద్ద మార్పులు లేకుండానే వాటిని నివారించే శక్తి.
Identifying household structural errors (Vastu) through your lineage deity, offering remedies without structural demolition.
మీ వ్యాపారానికి, ఉద్యోగానికి లేదా వివాహానికి అడ్డుపడుతున్న గ్రహ స్థితులను కచ్చితంగా గుర్తించి శాంతి మార్గాలు చూపే శక్తి.
Identifying which specific planet or celestial alignment is blocking your career, business, or marital harmony.
మీకు రాబోయే ప్రమాదాలు, ఆపదలను ముందే చూసి హెచ్చరించడం ద్వారా మీ ప్రయాణాన్ని సులభతరం చేసే శక్తి.
Foreseeing upcoming hazards or negative shifts in your life timeline, helping you take preventive decisions.
అయోమయం, గందరగోళంలో ఉన్న మీ మనస్సుకు శాంతిని చేకూర్చి, మీ జన్మ కారణమైన లక్ష్యాన్ని మరియు గమ్యాన్ని తెలియజేస్తారు.
Dispelling inner chaos and confusion to align you with the true purpose of your birth and lifetime goals.
మంత్ర శక్తులతో చేసే హోమాలు, యజ్ఞాల ఫలితాలు మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో స్పష్టంగా తెలుసుకునే అరుదైన అవకాశం.
Discerning the spiritual yields and outcomes of sacred fires and homas performed on your behalf to guarantee real changes.
పరిష్కార కేంద్రం
Remedy & Consultation Portal
వివాహం నిశ్చయం కాకపోవడం, వ్యాపారంలో నష్టాలు, సంతాన లేమి, నిరుద్యోగం లేదా ఏవైనా అదృశ్య దుష్ట శక్తుల ప్రభావం వల్ల మీ మనశ్శాంతిని కోల్పోయారా? అమ్మగారిని సంప్రదించి సమాధానం పొందండి.
Blocked marriages, declining sales, childlessness, constant setbacks, or negative energy in your surroundings. Ask Amma directly to find genuine, spiritual peace.
అమ్మగారు మీ ముఖం చూసి మీ భవిష్యత్తును మరియు మీ కులదైవాన్ని గ్రహిస్తారు. ప్రత్యేకించి జాతక చక్రాలు లేకపోయినా పర్వాలేదు, మీ నమ్మకమే ప్రధానం.
Amma reads your facial aura and connects with your family deity directly. Written horoscopes are not strictly required—your faith is key.
ఆలయం తూర్పు గోదావరి జిల్లా, ప్రత్తిపాడు మండలం లోని దివాన్ చెరువు (శక్తి పురం) లో కలదు. పిఠాపురం రోడ్డు మార్గంలో ప్రయాణించవచ్చు.
The temple is situated at Shakti Puram, Divan Cheruvu, Prathipadu Mandalam in East Godavari district. Easily accessible by road from Pithapuram.